Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

yudha raja simham thirigi leachenu

యూదా రాజ సింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిన్‌ గెలిచి లేచెను

1. నరక శక్తులన్ని ఓడిపోయెను
ఓడిపోయెను – ఆవి వాడి పోయెను

2. దూత సైన్యమంత – స్తుతించు చుండ
స్తుతించు చుండ – యేసుని సన్నుతించుచుండ

3. మరణ సంకెళ్ళను – త్రెంచి వేసెను
త్రెంచి వేసెను – వాటిన్‌ వంచి వేసెను

4. యేసు లేచెనని – మ్రోగుచున్నది
మ్రోగుచున్నది – భయమున్‌ ద్రోలుచున్నది

5. వనితల్‌ దూత వార్త – విశ్వసించిరి
విశ్వసించిరి – మదిన్‌ సంతసించిరి

6.పునరుద్ధానుడెన్నడు – మరణించడు
మరణించడు – మరణించడెన్నడు

7. యేసూ! నీదు పాదం – మ్రొక్కెదము
మ్రొక్కెదము – మము ముద్రించుము