యేసుని తిరు హృదయమా
నన్ను రక్షించు నా దైవమా (2)
స్నేహితుని వోలె ఆదరించావు
బోధకుడై నన్ను మందలించావు (2) ||యేసుని||
కష్టములొ నన్ను నీ రెక్కల దాచావు
దుఃఖంలో నా కన్నీరు తుడిచావు (2)
ఏ విధమున నిన్ను నే పొగడగలను (2)
నీ ఋణమును నేనెలా తీర్చగలను
నా తండ్రి నా దేవా ||యేసుని||
నను కాచి కాపాడే నా మంచి కాపరివి
నాకింక భయమేల నీ అండదండలలో (2)
జీవించెద నీ బిడ్డగ ఏ చింత లేక (2)
నీ ఆత్మతో దీవించు నా యేసు
నా తండ్రి నా దేవా ||యేసుని||