యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా
పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు
నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య
మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను
పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను
పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను
సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను ||యేసు||
యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి
నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి ||యేసు||
దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది
యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము ||యేసు||