యేసు రాజ్యమునకు సైనికులం
పరమునకు మనమే వారసులం (2)
ప్రేమ పంచిన దేవుని శిష్యులం
ఎదురు బెదురూ ఎరుగని వారలం (2)
కారు చీకటి కమ్మిన లోకము
కాదు మన ప్రభువుకు సమ్మతము
ఆత్మలు నశియించుట ఘోరము
వారి రక్షణయే మన భారము (2)
వెలుగే మనమని సెలవిచ్ఛేనని
అప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన||
వలదు నీ మదిలో సందేహము
ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము
తగిన రీతి తలాంతులు నొసగును
నిన్ను అద్భుత పాత్రగా మలచును (2)
నీకు భారము మదిలో మెదిలితే
ప్రభువే మార్గము చేయును సరళము (2) ||ప్రేమ పంచిన||
నీవు పొందిన సువార్త ఫలము
ఇతరులకు పంచుటయే ఘనము
సాక్ష్యమును చాటించే ధైర్యము
లోకమునకు చూపించును నిజము (2)
కోత ఎంతగ ఉంది విరివిగా
కోయుదాము ప్రభు పనివారుగా (2) ||ప్రేమ పంచిన||