యేసు ప్రభువే – సాతాను బలమును జయించెను
అందరము – విజయ గీతములు పాడెదము
విజయ గీతములు పాడెదము
మన శ్రమలలో విజయమునిచ్చెన్
తన రాజ్యమునందు మనలను చేర్చును (2)
ఘన విజయమును మనకై పొందెన్ (2)
మన విజయము యేసే అని హర్షించెదము (2) ||యేసు||
మనమాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను (2)
సంఘమునకు శిరస్సాయనే (2)
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము (2) ||యేసు||
మహోన్నతుడు మహా ఘనుడు
మహిమ రాజు మనకు విజయమునిచ్చే (2)
మరణము గెల్చి తిరిగి లేచే (2)
ఆర్భాటముతో హర్షించెదము (2) ||యేసు||