యేసూ నన్ ప్రేమించితివి
ఆశ్రయము లేనప్పుడు – నీ శరణు వేడగానే
నా పాప భారము తొలగే (2) ||యేసూ||
నే తలచలేదెప్పుడు – నా అంతమేమౌనని (2)
నా పాపములచే నేను నిన్ను విసిగించితిని ||యేసూ||
నిన్ను నే గాంచగానే – నా జీవితము మారెను (2)
నీయందు గృచ్చబడి నిన్నంగీకరించితి ||యేసూ||
రక్షణ దొరికే నాకు – రక్తముతో నన్ను కడిగి (2)
క్రయముగా నీ చెంతకు రక్షకా తెచ్చితివి ||యేసూ||