యేసు మంచి దేవుడు Telugu Christian Songs Lyrics

యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును (2) ||యేసు మంచి||

శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు (2)
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2) ||యేసు మంచి||

శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు (2)
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు (2) ||యేసు మంచి||

యేసు మంచి దేవుడు Jesus Songs Lyrics in Telugu


యేసు మంచి దేవుడు Telugu Christian Songs Lyrics