యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2) ||యేసు క్రీస్తు||
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2) ||ఇది పండుగ||
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2) ||ఇది పండుగ||
శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2) ||ఇది పండుగ||