Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసు కోసమే జీవిద్దాం Telugu Christian Songs Lyrics

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్నా
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా ||యేసు కోసమే||

నిందారహితులుగా జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము ||యేసు కోసమే||

యేసు స్వభామును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు ||యేసు కోసమే||

యేసు కోసమే జీవిద్దాం Jesus Songs Lyrics in Telugu


యేసు కోసమే జీవిద్దాం Telugu Christian Songs Lyrics