యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?
యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన
రోగియైన దాసుని కొరకు
శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా
విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)
యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే||
దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును (2)
యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే||
శోధనలనైనా సమస్తమును కోల్పోయిన
యోబువంటి విశ్వాసం గమనించుమా
యధార్ధతతో నిరీక్షించెను
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహనము చూపుము సమకూడి జరుగును (2)
యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||