యేసే నీ మదిలో ఉండగా
కలతే దరి చేరగ రాదుగా (2)
సోదరా సోదరీ.. యేసులో నెమ్మది
ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది ||యేసే||
తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా
ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా (2)
నీ చెంతకు చేరి నిలుపును
నీ చింతను తీర్చి నడుపును (2)
సోదరా సోదరీ.. యేసేనీ మాదిరి
సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి (2) ||యేసే||
సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెగా
సహింపలేని శోధనలను నీకు దయచేయునా (2)
శోధనలను గెలిచే మార్గము
తప్పక నీకొసగును తథ్యము (2)
సోదరా సోదరీ.. యేసులో విజయము
సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం (2) ||యేసే||