యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2)
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా||
అందరు ఉన్నారని అందరు నావారని (2)
తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2)
చివరికి ఒంటరి నేనైతిని
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా||
అంధకారములో అంధుడ నేనైతిని (2)
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2)
నాకొసగుమా నజరేయుడా
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా ||యేసయ్యా||