యేసయ్యా నా ప్రాణ నాథా
రుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో – (2)
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నా యేసయ్యా (2) ||యేసయ్యా||
నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకు
నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమ
నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి
కడు దీనుడవై నా పాప భారం మోసితివి
రిక్తుడవై వేలాడితివే
రక్తమే నాకై కార్చితివి ||హల్లెలూయా||
పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమ
యుగముల అంతము వరకు నాకై వేచినది – నీ ప్రేమ
ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో
శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి
అందదు నా మందికి అద్భుత ప్రేమ – (2) ||హల్లెలూయా||
నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను – నిర్మించితివే
నీ స్వకీయ సంపాద్యముగా నన్ను – చేసితివే
నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు
ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా
చాలదు నా జీవిత కాలమంతా – (2) ||హల్లెలూయా||