యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)
పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా||
ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||