యేసయ్య నిను చూడాలని యేసయ్య నిను చేరాలని
యేసయ్యనీతో ఉండాలని యేసయ్య నీలా నిలవాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం
ఎటు చూసిన పాపమే చీకటి కమ్మిన లోకములో
ఎటుపోయిన వేదనే పాపము నిండిన పుడమిలో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగొనియున్నది నా హృదయం
యదవాకిట శోదనే ద్వేషము నిండినా మనుషులతో
హృదిలోపట శోకమే కపటమైన మనస్సులతో
నీలా బ్రతకాలని నీతో ఉండాలని
ఆశగొనియున్నది నా మనస్సు
తృష్ణగినియున్నది నా హృదయం