యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య||
పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||
పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||