Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసయ్య మాట విలువైన మాట Telugu Christian Songs Lyrics

యేసయ్య మాట విలువైన మాట
వినిపించుకోవా సోదరా
వినిపించుకోవా సోదరీ (2)
నీ గుండెలోన ముద్రించుకోవా
ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుము
నిన్నూవలె నీ పొరుగువారిని
ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య||

ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2)
సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2)
దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య||

నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2)
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2)
నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య||

యేసయ్య మాట విలువైన మాట Jesus Songs Lyrics in Telugu


యేసయ్య మాట విలువైన మాట Telugu Christian Songs Lyrics