యేసయ్య మాట బంగారు మూట
ఎన్నటికి మారని మాటేనన్న
ఎన్నటెన్నటికి మారని మాటేనన్న
నిత్యజీవానికి సత్యమైనది
పరలోక రాజ్యానికి మార్గమైనది
పదరా పదరా పోదాం పదరా
(మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2)
చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా
పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా
తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా
అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా ||పదరా||
సమరయ స్త్రీని చూసాడయ్యా
కుండను బద్దలు కొట్టాడయ్యా
జీవపు ఊటలు ఇచ్చాడయ్యా
జీవితాన్నే మార్చివేసాడయ్యా ||పదరా||