Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

యేసన్న స్వరమన్నా Telugu Christian Songs Lyrics

యేసన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా (2) ||యేసన్న||

ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచె (2)
యెహోవా ఎదుటను ఆదాము దాగిన (2)
అటులనే నీవును దాగెదవా (2) ||యేసన్న||

జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో (2)
కలిసిన స్వరము పిలిచిన యేసు (2)
పిలిచిన పిలుపును నీవింటివా (2) ||యేసన్న||

ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరము (2)
ఈనాడు నీవును ఈ స్వరము వినగా (2)
కానాను చేరగా కదిలి రావా (2) ||యేసన్న||

యేసన్న స్వరమన్నా Jesus Songs Lyrics in Telugu


యేసన్న స్వరమన్నా Telugu Christian Songs Lyrics