Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

yehovanu sannutinchedam

యెహెూవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను
ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నాకున్న స్వరము నన్ను విడచిననూ
నావారే నన్ను విడచి నింద లేసిననూ (2)
నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నాకున్న భయములే నన్ను కృంగదీయగా
నా హృదయం నాలోనే నలిగిపోయెగా (2)
నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

నా ఆశలే నిరాశలై నిసృహలో వుండగా
నాపైన చీకటియే నన్నావరించెగా (2)
నా దీపము ఆరుచుండగా నా యేసయ్య వెలిగించెగా (2)
ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)