యెహోవానీ నామముఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ…ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది ||యెహోవా||
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి(2)
యెహోషువాప్రార్ధించగాసూర్యచంద్రుల నాపితివి (2) ||యెహోవా||
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా(2)
అగ్నిలో పడవేసినా భయమేమిలేకుండిరి (2) ||యెహోవా||
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి(2)
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) ||యెహోవా||
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా(2)
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళువిడిపోయెను (2) ||యెహోవా||
పౌలు సీలను బంధించిచెరసాలలో వేసినా(2)
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||