యెహెూవా. నను కరుణించుమూ
నా దేవా. నను దర్శించుమా
ఉదయమునే నీ సన్నిధిలో మొఱపెడుతున్నాను
వేకువనే నీ కృపకొరకై కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
విచారము చేత నా కన్నులు గుంటలై
వేదనచేత నా మనస్సు మూగదై
నా హృదయమెంతో అలసిసొలసి వున్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను
అవమానం చేత నా గుండెలు గాయమై
వంచనచేత నా ఊపిరి భారమై
నా హృదయమెంతో అలసిసొలసివున్నది
నా ప్రాణము నీకై ఎదురుచూస్తు వున్నది
దినమంతయు నేను ప్రార్థించుచు వున్నాను