విరిసిన హృదయాలకు కలిసెను బంధం
కనుసైగలు చేయుచు ముచ్చటించెను (2)
తీయని భాసలే కమ్మని ఊసులే
బంధువుల రాక స్నేహితుల యేర మనసు మురిపించెనే ||విరిసిన||
ఆశకే లేవు హద్దులు మనిషైనా ప్రతివానికి
అవి కలతలా బాధ రేపెను మరు క్షణము నీ బ్రతుకులో (2)
ఉన్నదంత చాలని – ప్రభువు మనకు తొడని (2)
మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన||
మనసులో దాగే తపనకు ప్రతిరూపమే ఈ దినం
ఎదురు చూసే పరువానికి ప్రతిరూపమే ఈ దినం (2)
ఏక మనస్సుతోనే – చక్కనైన జీవితం (2)
మరువకుమా ప్రియ మరువకుమా ||విరిసిన||