వినరే యో నరులారా – వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే
అనుదినమును దే-వుని తనయుని పద
వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే ||వినరే||
ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము – సలిపిన తెరంగిది ||వినరే||
ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును ||వినరే||
దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె – శరణని పోదము ||వినరే||