వికసించు పుష్పమా (2)
యేసు పాదాల చెంతనే వికసించుమా
తండ్రి పాదాల చెంతనే ప్రార్ధించుమా ||వికసించు||
నీ ప్రాణ ప్రియుడు సుందరుడు
నీ ప్రాణ ప్రియుడు అతి సుందరుడు (2)
మనోహరుడు అతి కాంక్షణీయుడు (2)
స్తోత్రార్హుడు (2) ||వికసించు||
నీ పరమ తండ్రి మహిమాన్వితుడు (4)
మహోన్నతుడు సర్వ శక్తిమంతుడు (2)
పరిశుద్ధుడు (2) ||వికసించు||
నీ హితుడు యేసు నిజ స్నేహితుడు (4)
విడువని వాడు నిను ఎడబాయని వాడు (2)
నీతి సూర్యుడు (2) ||వికసించు||