విడువవు నన్నిక ఎన్నడైననూ
పడిపోకుండా కాయు రక్షకా (2)
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభు (2) ||విడువవు||
ప్రభువా నీకవిధేయుడనై
పలు మారులు పడు సమయములలో (2)
ప్రేమతో జాలి దీన స్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి (2) ||విడువవు||
ఆదాము హవ్వలు ఏదెనులో
ఆశతో ఆజ్ఞ మీరినను (2)
సిలువకు చాయగా బలినర్పించి
ప్రియముగా విమోచించితివి (2) ||విడువవు||
మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా (2)
కొల్లగా నీ ఆత్మను నొసగితివి
హల్లెలూయా పాడెదను (2) ||విడువవు||