విడువను నిను ఎడబాయనని నా
కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా
నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా ||విడువను||
పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా ||విడువను||
మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి ||విడువను||
సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2)
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను ||విడువను||