Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

విడువదు మరువదు Telugu Christian Songs Lyrics

విడువదు మరువదు – విడువదు మరువదు
విడువదు మరువదు – ఎన్నడూ ఎడబాయదు
ఎనలేని ప్రేమ – విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు||

నా స్థితి ఏదైనా – చింత ఏదైనా
బాధ ఏదైనా – నను విడువదు
లోకమే నను చుట్టినా – ఆశలే నను ముట్టినా
యేసయ్య సాన్నిధ్యం – నను విడువదు
మా నాన్న నా చేయి విడువడు
ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2)

విడువడు మరువడు – విడువడు మరువడు
విడువడు మరువడు – ఎన్నడూ ఎడబాయడు

నన్ను ఎత్తుకున్న – నన్ను హత్తుకున్న
నా తండ్రి కౌగిలి – నే విడువను
శోకమే కృంగించినా – దుఃఖమే బాధించినా
నా ప్రియుని చిరునవ్వు – నే మరువను
నన్నెంతో ప్రేమించిన రాజును
ఎడబాసి మనలేనే రోజును (2)

విడువను మరువను – విడువను మరువను
విడువను మరువను – ఎన్నడూ ఎడబాయను
ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ
మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||

విడువదు మరువదు Jesus Songs Lyrics in Telugu


విడువదు మరువదు Telugu Christian Songs Lyrics