Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

velpulalo bahughanuda

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు !!2!!

నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత క్రుపనిచ్చేదవు. . . .

!!వేల్పులలో!!

1. సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు !!2!!
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో !!2!!

!!వేల్పులలో!!

2. ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు !!2!!
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో !!2!!

!!వేల్పులలో!!

3. పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
ఆజ్ఞనము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు !!2!!
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను !!2!!

!!వేల్పులలో!!