Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వర్ష ధారగా రావా Telugu Christian Songs Lyrics

వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఎండిపోయిన భూమి నేనయ్యా (2)
ఈ నేలలో పంట లేదయ్యా
నా మనస్సులో శాంతి లేదయ్యా (2)
వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఫలింపజేయుమా పరమేశ్వరా (2)

పాపములన్ని పరిహరించుమా
భయములెల్ల పారద్రోలుమా (2)
యేసు నాథుడా నా రక్షకా (4)
నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష||

మనో వ్యధలను గుణపరచుమా
తనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2)
యేసు నాథుడా పరమ వైద్యుడా (4)
గాయములెల్ల స్వస్థపరచుమా (2) ||వర్ష||

వర్ష ధారగా రావా Jesus Songs Lyrics in Telugu