Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

వాక్యమే శరీర ధారియై Telugu Christian Songs Lyrics

వాక్యమే శరీర ధారియై వసించెను
జీవమై శరీరులను వెలిగింపను
ఆ… ఆ…. ఆ… ఆ…. (2)

కృపయు సత్యములు – హల్లెలూయ
నీతి నిమ్మళము – హల్లెలూయ (2)
కలసి మెలసి – భువిలో దివిలో (2)
ఇలలో సత్యము మొలకై నిలచెను ||వాక్యమే||

ఆశ్చర్యకరుడు – హల్లెలూయ
ఆలోచనకర్త – హల్లెలూయ (2)
నిత్యుడైన – తండ్రి దేవుడు (2)
నీతి సూర్యుడు – భువినుదయించెను ||వాక్యమే||

పరమ దేవుండే – హల్లెలూయ
నరులలో నరుడై – హల్లెలూయ (2)
కరము చాచి – కనికరించి (2)
మరు జన్మములో మనుజుల మలచే ||వాక్యమే||

వాక్యమే శరీర ధారియై Jesus Songs Lyrics in Telugu