Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

తప్పిపోయిన గొర్రె Telugu Christian Songs Lyrics

తప్పిపోయిన గొర్రె – తప్పిపోయిన మనుష్యుడా
యేసు ప్రేమ నీకు గురుతుందా
మంచి కాపరి యేసు – గొప్ప కాపరి యేసు
ప్రధాన కాపరి యేసు ఆత్మల కాపరి (2)

కపటము కలిగిన గొర్రె
ద్వేషము కలిగిన గొర్రె
ఐక్యత లేని గొర్రె
యేసు ప్రేమ గురుతుందా (2)
మందను వీడినావు – ఒంటరి అయ్యినావు (2)
యేసు రాజు నిన్ను వెతుకుచుండెను (2) ||మంచి||

ప్రార్ధన చేయని మనుష్యుడా
వాక్యము వదలిన మనుష్యుడా
దేవుని మరచిన మనుష్యుడా
యేసు ప్రేమ గురుతుందా (2)
చాచిన చేతులతో నిన్ను ఆదరించెను యేసు (2)
మారు మనస్సు పొంది నీవు వెనకకు మారులుదువా (2) ||మంచి||

తప్పిపోయిన గొర్రె Jesus Songs Lyrics in Telugu