సువార్తను ప్రకటింపవా
సునాదము వినిపింపవా
సిలువను ధరియించవా
దాని విలువను వివరింపవా
లెమ్ము సోదరా
లేచి రమ్ము సోదరీ (2) ||సువార్తను||
సుఖము సౌఖ్యము కోరి నీవు
సువార్త భారం మరచినావు (2)
సోమరివై నీవుండి
స్వామికి ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||
నీలోని ఆత్మను ఆరనీకు
ఎదలో పాపము దాచుకోకు (2)
నిను నమ్మిన యేసయ్యకు
నమ్మక ద్రోహం చేయుదువా (2) ||లెమ్ము||