Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సుందరమైన దేహాలెన్నో Telugu Christian Songs Lyrics

సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన||

నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు (2)
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)
యేసులేని జీవితం వాడబారిన చరితం (2)
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2) ||సుందరమైన||

ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)
యేసులేని జీవితం అంధకార భందురం (2)
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2) ||సుందరమైన||

సుందరమైన దేహాలెన్నో Jesus Songs Lyrics in Telugu


సుందరమైన దేహాలెన్నో Telugu Christian Songs Lyrics