సుడిగాలైననూ నిశ్చలముగ చేసెదవు
నీవే నా బలం నీవే నా నమ్మకం (2)
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నా తోడు నడుచుచున్నావు
సదా నాతోనే ఉంటావు
ఎగసిపడే తుఫానుల్లో – నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా – అవి నీ పాదముల క్రిందనే (2)
వ్యాధి నను చుట్టినా
లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా
నీవే నా స్వస్థత (2) ॥గడచిన॥
ఓ వ్యాధి నీ శిరస్సు వొంగెనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు (2) ॥ఎగసిపడే॥