Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

Sthutiyinchedam Keertinchedam స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం

Sthutiyinchedam Keertinchedam స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం

Learn good christian song lyrics for telugu

స్తుతియించెదం కీర్తించెదం స్తుతి పాడెదం కొనియాడెదం
ప్రభు యేసునే స్తుతించెదం పరిశుద్ధాత్మనే కీర్తించెదం
రారాజుకే స్తుతి పాడెదం త్రీయేక దేవుని కొనియాడెదం

మనలను ఎంతో ప్రేమించిన పరమ తండ్రిని స్తుతియించెదం
మనకై ధరణిలో ఉదయించిన క్రీస్తేసునాధుని కీర్తించెదం
సత్యములోనికి నడిపించిన పరిశుద్ధాత్మను కొనియాడెదం

మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతియించెదం
మన దోషములకై మరణించిన ప్రియ కుమారుని కీర్తించెదం
మనకై విజ్ఞాపణ చేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం