Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తుతులకు పాత్రుడా (ఆరాధన) Telugu Christian Songs Lyrics

స్తుతులకు పాత్రుడా – ఘనతకు అర్హుడా
నిరతము నిలచువాడా – నీకే స్తోత్రము
త్వరలో రానున్న – మా మెస్సయ్యా
మరణము గెలచిన మా విమోచకుడా
ఆరాధన చేసెదం
అజేయుడా మా ప్రభూ
అద్వితీయ సత్య దేవుడా
నీవే మా రాజువు (2) ||స్తుతులకు||

నీతియు సమాధానము
ఆనందము నీ రాజ్యము
నీ సిలువయే మాకు శక్తి
నీ సిలువయే మాకు బలము (2)
ఆత్మానుసారమైన
నవీన జీవితమునిచ్చితివి
ఆత్మ నియమము ద్వారా
పాప మరణము నుండి విడిపించితివి (2) ||ఆరాధన||

నీవే మా నిరీక్షణకర్తవు
నమ్మదగినవాడవు
నీలోనే మా అతిశయము
మమ్ము విలువ పెట్టి కొన్నావు (2)
ప్రభువా మీతో మేము
ఏకాత్మయై యున్నాము
అక్షయమగు కిరీటము
ధరియింపజేయువాడవు నీవే (2) ||ఆరాధన||

స్తుతులకు పాత్రుడా (ఆరాధన) Jesus Songs Lyrics in Telugu


స్తుతులకు పాత్రుడా (ఆరాధన) Telugu Christian Songs Lyrics