Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తుతికి పాత్రుడా Telugu Christian Songs Lyrics

స్తుతికి పాత్రుడా సత్య శీలుడా (2)
నిరతము నీలో సాగె కృపను ఇమ్మయ్యా
నిరతము నిన్ను సేవించే శక్తిని ఇమ్మయ్యా (2) ||స్తుతికి పాత్రుడా||

ప్రేమధ్వజమును సిలువలో నిలిపి
అనంతప్రేమను చూపితివి
పాపమునుండి విడిపించి
రక్షణవస్త్రం నొసగితివి (2)
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
వర్ణించలేనిది వివరించలేనిది (2) ||స్తుతికి పాత్రుడా||

యోగ్యతలేని మాకై నీ
పౌరసత్వాన్ని ఇచ్చితివి
పరిశుద్దాత్మను మాకొసగి
బలవంతులుగా చేసితివి (2)
ఎలాగు మరువను ఎలాగు విడువను
నీ స్నేహము నీ బంధము (2) ||స్తుతికి పాత్రుడా||

స్తుతికి పాత్రుడా Jesus Songs Lyrics in Telugu


స్తుతికి పాత్రుడా Telugu Christian Songs Lyrics