Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

స్తోత్రం చెల్లింతుము Telugu Christian Songs Lyrics

స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రంచెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||

దివారాత్రములు కంటిపాపవలె కాచి(2)
దయగల హస్తముతోబ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||

గాడాంధకారములో కన్నీటి లోయలలో(2)
కృశించి పోనీయకకృపలతోబలపరచితివి (2) ||స్తోత్రం||

సజీవ యాగముగా మా శరీరముసమర్పించి(2)
సంపూర్ణ సిద్దినొందశుద్ధాత్మను నొసగితివి (2) ||స్తోత్రం||

సీయోను మార్గములో పలుశోధనలు రాగా(2)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2) ||స్తోత్రం||

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి(2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2) ||స్తోత్రం||

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా(2)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||

స్తోత్రం చెల్లింతుము Jesus Songs Lyrics in Telugu


స్తోత్రం చెల్లింతుము Telugu Christian Songs Lyrics