సృష్టికర్తవైన యెహోవా
నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు
మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూసావు
నీలో నన్ను దాచావు
నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా
మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||
ఏ కాంతి లేని నిశీధిలో
ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2)
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||
నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన||