సొంతమైపోవాలి నా యేసుతో
మిళితమై పోవాలి నా ప్రియునితో (2)
సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)
ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతో
లీనమై పోవాలి ఆ ప్రేమలో (2)
నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి
నా వరుడు కలువరిలో బలియాయెను (2)
బలి అయిన వానికే నా జీవితం
అర్పించుకొనుటే నా ధర్మము (2)
ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై||
పరదేశిగా నేను వచ్చానిలా
తన ప్రేమ కీర్తిని చాటాలని (2)
ప్రియుని కోసమే బ్రతికెదను
కాపాడుకొందును సౌశీల్యము
ప్రభువు కోసమే బ్రతికెదను
కాపాడుకొందును నా సాక్ష్యము
యేసుతో జీవితం పరమున శాశ్వతం (2) ||సొంతమై||