స్నేహితుడా నా హితుడా
నన్ను మరువని బహు ప్రియుడా
నన్ను విడువని నా హితుడా
ఏమని నిన్ను వర్ణింతును
నీ ప్రేమకు నేను ఏమిత్తును (2) ||స్నేహితుడా||
కారుచున్న కన్నీరు తుడిచి
పగిలియున్న గుండెను ఓదార్చి (2)
ఆదరించిన స్నేహితుడా
నన్నోదార్చిన నా హితుడా (2)
నన్ను ఓదార్చిన నా హితుడా ||స్నేహితుడా||
మోడుగున్న బ్రతుకును చిగురించి
గూడు చెదరిన నన్ను దరి చేర్చి (2)
కృపను చూపిన స్నేహితుడా
కనికరించిన నా హితుడా (2)
నన్ను కరుణించిన నా హితుడా ||స్నేహితుడా||