Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

సిలువలో ఆ సిలువలో Telugu Christian Songs Lyrics

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి||

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి||

నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి||

సిలువలో ఆ సిలువలో Jesus Songs Lyrics in Telugu


సిలువలో ఆ సిలువలో Telugu Christian Songs Lyrics