సిలువ చెంతకు రా (4)
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా
యవ్వన కాల పాపములో
మరణ మార్గాన వెళ్లెదవా (2)
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా (2) ||సిలువ||
సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2)
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా (2) ||సిలువ||
సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును (2)
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ||