Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శ్రేష్టమైన నామం Telugu Christian Songs Lyrics

శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం (2) ||శ్రేష్టమైన||

త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2) ||శ్రేష్టమైన||

శ్రేష్టమైన నామం Jesus Songs Lyrics in Telugu


శ్రేష్టమైన నామం Telugu Christian Songs Lyrics