శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2)
సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?
శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు
యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త
మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు
దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు
విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము
శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును
విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను
యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను
ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో
మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో
మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు
విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||