శోధనా బాధలు Telugu Christian Songs Lyrics

శోధనా బాధలు చుట్టినా నన్ను ముట్టినా
సాగిపోవుటే నాకు నా యేసు నేర్పెనే – (2) ||శోధనా||

నడవలేక నా పడవ నది సముద్రమందున
నడుపుట నా వల్ల కాక నేనెడుస్తుండగా (2)
చూచెనే యేసు చెంతకు చేరెనే (2)
ఆయనుండి నా పడవ ఆ దరికి చేర్చెనే (2) ||శోధనా||

పాపమని దొంగ యూభి పడిపోవుచుండగా
పైకి తీయువాడు లేక మునిగి పోవుచుండగా (2)
చూచెనే యేసు చేయి చాచెనే (2)
లేవనెత్తి శుద్ధి చేసి తన బండపై నిలిపెనే (2) ||శోధనా||

శోధనా బాధలు Jesus Songs Lyrics in Telugu