శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె (2)
కాచిన కృప ||శాశ్వతమైనది||
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి (2)
నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) ||శాశ్వత||
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2)
నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే (2) ||శాశ్వత||
పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన (2)
నా కృప నిను వీడదని అభయమిచ్చితివే (2) ||శాశ్వత||