Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శాశ్వతమైన ప్రేమతో Telugu Christian Songs Lyrics

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
నీ ప్రేమే నను గెల్చెను
విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
నీ కృపయే నను మార్చెను
నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ తేనె కంటే మధురము
నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా
నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను వెంబడింతును
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన||

నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
దృష్టించి నిర్మించిన ప్రేమ
నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
గ్రంధములో లిఖియించిన ప్రేమ
నా ఎముకలను నా అవయములను
వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నీ కోసం సృజియించావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను మురిపెంగా లాలించావయ్యా ||శాశ్వతమైన||

నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
నను విడువక వెంటాడిన ప్రేమ
నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
నా కోసం వేచిచూచిన ప్రేమ
బాల్య దినముల నుండి నను సంరక్షించి
కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
యవ్వన కాలమున కృపతో నను కలిసి
సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
యేసయ్యా నను దర్శించినావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను ప్రత్యేకపరిచావేసయ్యా ||శాశ్వతమైన||

నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
నా విలువని పెంచేసిన ప్రేమ
లోకమే నను గూర్చి చులకన చేసినను
తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
యేసయ్యా… యేసయ్యా…
నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
నను నీలా మార్చేందులకేనయ్యా ||శాశ్వతమైన||

పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
కరుణించి పైకి లేపిన ప్రేమ
నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
నను చంకన ఎత్తుకున్న ప్రేమ
నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నను మరలా సమకూర్చావేసయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా ||శాశ్వతమైన||

కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
నా తోడై ధైర్యపరచిన ప్రేమ
చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
లోకమే మారిననూ మనుషులే మరచిననూ
మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
నా విశ్వాసం కాపాడవయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
బంగారంలా మెరిపించావయ్యా ||శాశ్వతమైన||

ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
అందలమును ఎక్కించిన ప్రేమ
పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
ప్రేమతో… ప్రేమతో…
శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
నను చిరకాలం ప్రేమిస్తావయ్యా ||శాశ్వతమైన||

శాశ్వతమైన ప్రేమతో Jesus Songs Lyrics in Telugu


శాశ్వతమైన ప్రేమతో Telugu Christian Songs Lyrics