Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors

శాశ్వతమా ఈ దేహం Telugu Christian Songs Lyrics

శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా…

శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా (2)

క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె – (2)
దేహము ఏ వేళా చితికిపోవునో ||శాశ్వతమా||

ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా – (2)
నీ గతి ఏమో నీకు తెలియునా ||శాశ్వతమా||

దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో – (2)
చిరజీవముతో తరియించేవు ||శాశ్వతమా||

శాశ్వతమా ఈ దేహం Jesus Songs Lyrics in Telugu


శాశ్వతమా ఈ దేహం Telugu Christian Songs Lyrics